Site icon PRASHNA AYUDHAM

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు* *3.10 కోట్ల విలువ గల 2.955 కిలోల బంగారు ఆభరణాలు, బ్రీజా కారు స్వాధీనం..*

IMG 20240805 123819

Oplus_0

*అంతర్ రాష్ట్ర దొంగల ముఠా “ఖంజర్ ఖెర్వా” గ్యాంగ్ ను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు*

*3.10 కోట్ల విలువ గల 2.955 కిలోల బంగారు ఆభరణాలు, బ్రీజా కారు స్వాధీనం..*

*వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): అంతర్ రాష్ట్ర దొంగల ముఠా “ఖంజర్ ఖెర్వా” గ్యాంగ్ ను పట్టుకొని, 3.10 కోట్ల విలువ గల 2.955 కిలోల బంగారు ఆభరణాలు, బ్రీజా కారు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ సబ్-డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గత 26న మధ్యరాత్రి చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల కోహినూర్ దాభా వద్ద భోజనం కొరకు ఆగిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్ లో నుండి 2.955 కిలోల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదు రాగా, జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి దొంగల కొరకు గాలిస్తుండగా, ఆదివారం జిల్లా ఎస్పీ రూపేష్ ఉత్తర్వుల మేరకు జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ బి.శివలింగం, సి.సి.యస్. ఇన్స్ పెక్టర్ మల్లేశం, సి‌సి‌ఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్, చిరగ్పల్లి ఎస్ఐ కే.రాజేందర్ రెడ్డి, జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ ప్రసాద్ రావు, హద్నూర్ ఎస్‌ఐ రామానాయుడు, సిబ్బంది లక్ష్మారెడ్డి, ఎస్‌బి ఏ‌ఎస్‌ఐ, జైపాల్ రెడ్డి హెచ్‌సి 577, బి రెఖ్యా హెచ్‌సి 959, ఎం‌డి. రశీద్ పి‌సి 182, సయ్యద్ అస్లం పి‌సి 847, రాజశేఖర్ పి‌సి 284, ఎం‌డి. అన్వర్ పాషా పి‌సి 360, ఎం. శశిధర్ పి‌సి 496 లు కలిసి జాతీయ రహదారి 65 రోడ్డు బూర్ధిపాడ్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా.. ఒక మారుతి బ్రీజా కారు నెంబర్: సీజీ04హెచ్ డీ 9765 డ్రైవరు అనుమానాస్పదంగా వస్తుండగా, అట్టి కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారిని కారులో నుండి కిందకు దించి విచారించే సమయంలో పారిపోతుండగా అందులో నుండి ఒక వ్యక్తిని పట్టుకొని వివరాలు తెలుసుకొనగా.. అతని పేరు మాసూమ్, పారిపోయిన వారి వివరాలు తెలుసుకొనగా.. అష్రాఫ్, ఫెరోజ్, సాజిద్ అని తెలిసింది. పై నలుగురు వ్యక్తులు దేశవ్యాప్తంగా దాభా హోటల్స్ వద్ద ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడతారని అన్నారు.  గత వారం రోజుల క్రితం చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల కోహినూర్ ధాభా హోటల్ వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుండి బంగారు ఆభరణాలు దొంగతనం చేసినామని తెలిపి, బ్రీజా కారులో ఉన్న బ్యాగులో గల 3 కిలోల బంగారు ఆభరణాలు తీసి చూపించారు. సోమవారం కూడా జహీరాబాద్ ప్రాంతంలో ఇంకొక పెద్ద దొంగతనం చేసి మొత్తం బంగారం హైదరాబాద్ లో అమ్ముదామని మద్యప్రదేశ్ నుండి బయలుదేరి జహీరాబాద్ వైపు వస్తుండగా బుర్దీపాడు చౌరస్తాలో పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఆ బ్యాగులో దొరికిన బంగారు ఆభరణాలను తూకం వేయించగా మొత్తం 2.955 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని, అట్టి బంగారం విలువ 3 కోట్ల 10 లక్షలు అని తెలిపారు. ఈ కేసు డిటెక్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ రూపేష్ అభినందించి, నగదు రివార్డ్ అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు. ఎస్పీ ఎ. సంజీవరావ్, జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, ఇన్స్పెక్టర్ సిసియస్  మల్లేశం, ఎస్.ఐ. సిసియస్ శ్రీకాంత్, చిరాగ్ పల్లి ఎస్ఐ. రాజేందర్ రెడ్డి, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. ప్రసాద్ రావ్, హద్నూర్ ఎస్ఐ రామనాయుడు, సిసియస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version