Headlines
-
సంగారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మున్నూరు రోహిత్ ఎన్నిక
-
జగ్గారెడ్డి అభినందనలు: యువజన కాంగ్రెస్ బలోపతం చేయాలని సూచన
-
యువజన కాంగ్రెస్ కొత్త నాయకత్వం: ప్రాజెక్ట్ చేయాల్సిన కార్యక్రమాలు
-
మండల స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వానికి సదాశివపేట్ నుండి మొహమ్మద్ సాజిద్
-
తెలంగాణ కాంగ్రెస్: యువ నాయకులకు జగ్గారెడ్డి సూచనలు
సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ యూత్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మున్నూరు రోహిత్, కంది మండల అధ్యక్షుడు కె.ప్రవీణ్ కుమార్, సంగారెడ్డి మండల అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, సదాశివపేట్ మండల అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్ లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందించారు. మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా గెలుపొందిన వారు మున్నూరు రోహిత్ ఆధ్వర్యంలో సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ బలోపతం చేయాలని, యువకులు పార్టీ కార్యక్రమంలో ముందుండాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు.