హోటళల్లో పారిశుద్ధ్యం దారుణం..

హైదరాబాద్‌  గ్రేటర్‌లోని 50మంది సామర్థ్యం దాటిన హోటళ్లలో వంటగదులు, భోజనశాలలో సీసీ కెమెరాలు ఇక నుంచి తప్పనిసరి. వినియోగదారులకు శుచి, శుభ్రమైన ఆహారం అందించేందుకు వీలుగా ఈ నిబంధనను తప్పకుండా అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. నగరంలో చాలా హోటళల్లో పారిశుద్ధ్యం దారుణంగా ఉంటోంది. రోజుల తరబడి ఆహార పదార్థాలను ఫ్రిజ్‌ల్లో పెట్టి అవే మళ్లీ మళ్లీ వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తున్నారు. కొన్ని హోటళ్లలో బొద్దింకలు, తల వెంట్రుకలు లాంటివి దొరుకుతున్నాయి. శుభ్రమైన తాగునీటిని కూడా అందించడం లేదు. ఈ నేపథ్యంలో హోటళ్లపై బల్డియా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి హోటల్‌లో సీసీ కెమెరాలు పెట్టి వాటిని జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి అనుసంధానం చేయడం, లేదంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు వాటిని పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Join WhatsApp

Join Now