మండలంలో ఉన్న ప్రతి పంచాయితి లో తక్షణమే పారిశుద్ధ్య పనులుచేపట్టాలి

చర్ల:మండలంలో ఉన్న ప్రతీ పంచాయతీ లో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. తద్వారా ప్రజలు ప్రాణాలను కాపాడాలి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వంటి విష జ్వరాలనుండి ప్రజలను రక్షించాలి. మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల కమిటీ….భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలో గత వారం పది రోజుల నుండి అత్యంత భయంకరంగా ఎడతెరిపలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలో ఉన్న 26 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఏ గల్లీలో చూసిన రోడ్లపై గుంతలలో మరియా సందు గొందులలో మురికి నీరు చేరి రోజుల తరబడి నిల్వా ఉండడం తో అత్యంత దుర్వాసనతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత భయంకరంగా పడుతున్న వర్షాలకారణంగా పెరుగుతూవస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకొని మండలంలో ఉన్న పలు గ్రామాలను గురువారం సందర్శించడం జరిగిందని అన్నారు. సందర్శించిన క్రమంలో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని కోరారు.బారివర్షాల పడుతున్నకారణంగా రోడ్లపై గుంతలలో మురికి నీరు ఎక్కువరోజులు నిలువ ఉండడంతో పందులు స్ఫైరా విహారం చేయడం జరుగుతుందని అన్నారు.ఆ నీల్లలోనే దోమలు అభివృద్ధి చెంది అక్కడ దెగ్గర్లో నివసిస్తున్న ప్రజల ఇళ్లలోకి చేరి ప్రజలు దోమ కాటుకు గురై డెంగ్యూ, మలేరియా,టైఫెడ్, వంటి వ్యాధులతో ఆసుపత్రి పాలై అప్పులపాలౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోగులు ఇళ్లలోకంటే కూడా హాస్పిటల్స్ లొనే ఎక్కువగా మగ్గిపోతున్నారని తెలిపారు.గత రెండు రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో చర్ల లో ఒక మహిళ మరణించడం జరిగిందని అట్టి విషయాన్ని అధికారులు మరువద్దని ఆయన గుర్తు చేశారు. తక్షణమే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య పనులను తక్షణమే అమలు చేయ్యాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని తద్వారా ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు చెన్నం మోహన్, మెహముదా, లక్ష్మి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now