Site icon PRASHNA AYUDHAM

పారిశుద్ధ్య కార్మికుడి లంబాడీ నరసింహ డ్రైనేజీ లో మృతి..

IMG 20241111 WA0037

పారిశుద్ధ్య కార్మికుడి లంబాడీ నరసింహ డ్రైనేజీ లో మృతి..


మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి
పారిశుద్ధ్య కార్మికుడి లంబాడీ నరసింహ పారిశుద్ధ్య విధుల్లో భాగంగా సోమవారం ప్రమాదవశాత్తు మృతి చెందారు.మృతి చెందిన నరసింహ కుటుంబానికి న్యాయం చేయాలని బొల్లారం బీజేపీ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు.ఘటనా స్థలానికి చేరుకుని దగ్గర ఉండి మృతదేహాన్ని బయటికి తీయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడి మురికి లో సైతం పని చేస్తున్నారని అలాంటి వారి పట్ల సేఫ్టీ పద్ధతులు పాటించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.మృతి చెందిన నరసింహ కుటుంబానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో మున్సిపల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version