Site icon PRASHNA AYUDHAM

తీగల గుట్టపల్లి లో పారిశుద్ధ్య పనులు

IMG 20240803 WA0085

*తీగల గుట్టపల్లిలో పారిశుద్ధ్య పనులపై ఫోకస్ పెట్టిన కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 3*

కరీంనగర్ నగరపాలక సంస్థ ఒకటో డివిజన్ తీగల గుట్టపల్లి కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ శనివారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలో పారిశుద్ధ్య పనుల పై ఫొటోస్ పెట్టారు డివిజన్లోని పలు కాలనీలో మున్సిపల్ కార్మికులతో మురికి కాలువలను శుభ్రం చేయించారు ప్రజలు క్రిమి కీటకాలు దోమల బారిన పడకుండా బ్లీచింగ్ క్రిమిసంహారక రసాయనాలను పిచికారి చేయించి మురికి నీటిలో ఆయిల్ బాల్స్ ను వేయించారు కార్పొరేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో డివిజన్లోని పలు ప్రాంతాల్లో మురికి నీరు నిలిచిందని దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని ఉద్దేశంతో పారిశుద్ధ్య పనులపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు

Exit mobile version