బీఆర్ఎస్.. గంగలో కలిసిన పార్టీ: బండి సంజయ్
బీఆర్ఎస్ గంగలో కలిసిన పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందని జోస్యం చెప్పారు. అందుకే కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారన్నారు.