నిజాంపూర్ (కె) పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నుండి పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించారు. బాలికలు పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దారు. హరిదాసు వేషధారణలో సంజయ్ అలరించాడు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో భోగిమంటలు వేశారు. అనంతరం రంగురంగుల పతంగులు ఎగుర వేశారు. అంతకు ముందు ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవనీత, సునీత విద్యార్థులకు సంక్రాంతి పండుగ గురించి వివరించారు. సంక్రాంతి పండుగను జరుపుకునే విధానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ మాట్లాడుతూ.. పండుగలను సంతోషంగా జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు. పతంగులు ఎగుర వేసేటప్పుడు మాంజ దారాలు వాడవద్దని, వాటి వల్ల జంతువులకు పక్షులకు ప్రమాదాలు జరుగుతాయని, కావున సహజసిద్ధమైన దారాలను ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవనీత, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment