ఆర్ కె గ్రూప్ ఆఫ్ కళాశాలల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కె గ్రూప్ ఆఫ్ కళాశాలల ఆధ్వర్యంలో (ఆర్కే, ఎస్ ఆర్ కె,వి ఆర్ కె కళాశాలల్లో) సంక్రాంతి సందర్భంగా రంగవల్లి (ముగ్గుల) పోటీలు నిర్వహించగా సుమారు వంద మంది విద్యార్థులు ముగ్గులు వేసారు. వీరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లను కళాశాలల వారీగా ఆర్కే గ్రూప్ కరస్పాండెంట్ అండ్ సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వారి ప్రతిభను ఉపయోగించి వేసిన ఈ ముగ్గులు విభిన్న అంశాలను ప్రతిబింబించే లా ఉన్నాయని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు ఇలాంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సైదయ్య , దత్తాత్రి, నవీన్, శంకర్ ,నరేష్, గోవర్ధన్ రెడ్డి , గంగాధర్,తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్స్, ఏ వో, మహిళా అధ్యాపకులు విజయలక్ష్మి, శ్రీవాణి ,మమత తదితరులు పాల్గొన్నారు.
Post Views: 11