*కీసరగుట్టలో సంతోష్ రావు, మల్లారెడ్డి: ప్రత్యేక పూజలు, హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం*
మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జులై 27
మేడ్చల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు మరియు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
దర్శనం అనంతరం సంతోష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలోని అతి పుణ్యక్షేత్రమైన కీసరగుట్టను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
అనంతరం, ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి వారు హరితహారం కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన మల్లారెడ్డి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
పూజల అనంతరం కీసరగుట్ట దేవస్థానం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పలువురు స్థానిక నాయకులు, భక్తులు కూడా పాల్గొన్నారు.