ఓసి సంఘాలకు తీన్మార్ మల్లన్న క్షమాపణలు చెప్పాలి: సంతోష్…
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓసి సంఘాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఓసి సంఘాల జిల్లా అధ్యక్షుడు జనగాం సంతోష్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ ఆయన మాట్లాడారు. ఓసి సంఘాలకు కల్పించిన రిజర్వేషన్ వల్ల ముదిరాజులు నష్టపోతున్నారని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తీన్మార్ మల్లన్న ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు