పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయం
–శాతవాహన యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శాతవాహన వర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కల్, బాన్సువాడ ,ఎల్లారెడ్డి, నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల పట్టభద్రులందరినీ కలిసి సర్దార్ రవీందర్ సింగ్ కి మీ అండదండ ఉండాలని కోరుతే మేమందరం సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు కోసం అంతా సిద్ధంగా ఉన్నామని అతని పథకాలు అద్భుతంగా ఉన్నాయని కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రసిద్ధి కెక్కడంలో తన యొక్క సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయని పట్టభద్రుల కోసం ఒక రూపాయికి జీవిత ప్రమాద బీమా పథకాన్ని ఐదు లక్షల వరకు వర్తింపజేసేలా తను ముందుకు వస్తున్నాడని, ప్రతి ఒక్కరం అండదండగా ఉంటామని గ్రాడ్యుయేట్స్ అందరూ ముక్తకంఠంతోటి గొంతేత్తారని అన్నారు.
కెసిఆర్ ప్రియ శిష్యులు రవీందర్ సింగ్ కరీంనగర్ మేయర్ గా ఉన్నప్పుడే ఒక రూపాయికి అంత్యక్రియలు, ఇంటింటికి నల్ల, సరస్వతి ప్రసాదం, ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించిన మనసున్న మహానేత సర్దార్ రవీందర్ సింగ్ అని, ప్రతి గ్రాడ్యుయేట్స్ ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకుల ఆకినపల్లి నరేష్, రాజీవ్ నాయక్, బండ అశోక్, తదితరులు పాల్గొన్నారు.