*ఎర్ర పహాడ్ గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి*
— జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 18
తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగులు చక్రవర్తి ఔరంగా జేబును ఓడించి గోల్కొండ కోటను ఏలిన మహావీరుడని ఆయన కొనియాడారు. ప్రతి గౌడబిడ్డ పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, కాసాల శ్రీకాంత్ గౌడ్, రాజలింగం, రమేష్, కొనింటి సాయిలు కర్రోళ్ల సంతోష్, కర్రోళ్ల సందీప్, బంగారి కాల నరేష్, తెనుగు వరుణ్, రాపోలు శ్రీకాంత్, రాపోలు భరత్, తదితరులు పాల్గొన్నారు.