సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు ఆహ్వానం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 3
హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి, వారోత్సవాలకు కామారెడ్డి కి చెందిన వ్యాపారి లచ్చునాగార్జున గౌడ్, కు జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీగౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఆశయాలను నిర్వహించడానికి ప్రతి గౌడబిడ్డ కృషి చేయాలని ఆయన కోరారు కామారెడ్డి జిల్లా నుండి ఆగస్టు 10న రవీంద్రబారీతిలో జరిగే సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు భారీ సంఖ్యలో గౌడ సోదరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షులు, రంగొళ్ళ మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్న శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఇందూరి సిద్దాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.