అమ్మవారికి అగ్గిపెట్టలో చీర…!!
వేములవాడ : సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయకుమార్ మంగళవారం వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించి అమ్మవారి కోసం ఆలయ ఈవో వినోద్ కు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను అందజేశారు. తాము ప్రతిఏటా అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుకరిస్తున్నట్టు చెప్పారు, అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు, అర్చకులు వారిని ఆశీర్వదించారు.