బీసీల పట్ల కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు -హామీల పట్ల నిర్లక్ష్యం
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలకు వెళ్లే ఆలోచనల్లో కాంగ్రెస్ కు బీసీ సమాజం గుణపాఠం చెప్పాలి
బడ్జెట్లో బీసీ లకు తీవ్ర అన్యాయం… 50,000 కోట్ల నిధులు అవసరమైతే 9200 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది..
బీసీ డిక్లరేషన్ ను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం…
జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నెట్టు శ్రీశైలం
కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో జూలై 30
రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో బీసీలకు కేవలం 9,200 కోట్లు కేటాయించి తీవ్ర అన్యాయం చేసిందని బీసీలకు ఇచ్చిన హామీలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నెట్టు శ్రీశైలం అన్నారు బీసీల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని బడ్జెట్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర అన్యాయం మోసాన్ని నిరసిస్తూ బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ మంగళవారం రోజున కరీంనగర్లోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఇట్టి కార్యక్రమానికి హాజరైనవారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మేనిపోస్టులో బీసీ కులగనన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి విద్యా ఉద్యోగ రంగాలలో 20 శాతం నుండి 42 శాతానికి పెంచుతామని హామీఇచ్చి నేడు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు పెంచకుండానే వెళ్దామని చూస్తుందని బీసీ సమాజం అంతా ఈ విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ ను పూర్తిగా అటకెక్కిచ్చిందన్నారు బీసీల సమస్యల పట్ల కామారెడ్డి డిక్లరేషన్ పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు బిజెపి ఆధ్వర్యంలో బీసీల సమస్యల పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదన్నారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు 50వేల కోట్లు అవసరమైతే 9,200కోట్లు మాత్రమే కేటాయించి రాష్ట్ర జనాభాలో 50% ఉన్న బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని హామీలు డిక్లరేషన్ కు అవసరమైన 50 వేల కోట్ల నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యం కల్పించాలన్నారు బీసీలకు కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినపత్రం సమర్పించారు ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని గొల్ల కురుమలకు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీ కి సంబంధించి రెండు లక్షల రూపాయలు లబ్ధిదారుని ఎకౌంట్లో వేస్తామన్న హామీ మరిచి గొల్ల కురుమలను మోసం చేసిందని బీసీ సబ్ ప్లాన్ కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ఏడాదికి 20వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్న నిధుల విషయం పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని
ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని
అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా పూచికత్తు లేకుండా పది లక్షల రుణాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఆరు నెలల్లోగా ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేసిందని సమయం గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సంఘాలకు చేప పిల్లల పంపిణీ చేయకుండా బిడ్లు ఆహ్వానించి 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి తెర లేపిందని ముదిరాజ్ గంగపుత్ర గౌడ్ మున్నూరు కాపు పద్మశాలి విశ్వకర్మ రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని కనీసం క్యాబినెట్లో నిర్ణయాలు గాని తీసుకోలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట కార్యదర్శి భోగ విజయభాస్కర్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడిచెర్ల రాజు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రాంగోపాల్ రెడ్డి కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్ కాసర్ల ఆనంద్ వంగల పవన్ కుమార్ పెద్దపల్లి జితేందర్ కొలిపాక శ్రీనివాస్ వెంకటరమణారెడ్డి నాంపల్లి శ్రీనివాస్ వాసాల రమేష్ వేముల చంద్రశేఖర్ కళ్లెం వాసుదేవ రెడ్డి బొంతల కళ్యాణ్ చంద్ర కటకం లోకేష్ అలివేలుసమ్మిరెడ్డి పుప్పాల రఘు రంగు భాస్కరాచారి వాసాల రమేష్ బండి మల్లయ్య యాదవ్ గుంజేటీ శివకుమార్ శివరాజ్ గర్దాస్ సతీష్ కలికోట మోహన్ మల్లికార్జున్ నడిగూడ కుమార్ మహేష్ ఎర్రోజ్ లక్ష్మణ్ గంట సంపత్ రాగి సత్యనారాయణ హరిప్రసాద్ మాసం గణేష్ ఎడమ సత్యనారాయణ రెడ్డి గొడుగు వినోద్ రవియాదవ్ కైలాస నవీన్ దేవిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.