ఆలమూరు నూతన సబ్ రిజిస్ట్రార్ గా సరోజిని..
ఆలమూరు మండల సబ్ రిజిస్ట్రార్ గా కోన విమల సరోజినీ కుమారి నూతనగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న శేఖర్ బాబు ప్రభుత్వ బదిలీల్లో భాగంగా కొత్తపేట వెళ్లగా బిక్కవోలు సబ్ రిజిస్టర్ గా విధుల్లో ఉన్న సరోజినీ కుమారి బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు._