అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తొగుట మండలం సర్పంచ్ల ఫోరం వైస్ ప్రెసిడెంట్ చందాపూర్ తాజా మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు యాదవ్ మాట్లాడుతూ గతా బిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ పదవి కాలం ముగిసే సమయానికి 18 నెలల వరకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ప్రతి సర్పంచ్ని అప్పులపాలు చేసిందని, అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు గడుస్తున్న సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రతి సర్పంచ్ తన స్థాయికి మించి గ్రామాలను అభివృద్ధి చేస్తే చివరికి సర్పంచ్ల ఆస్తులు అమ్మి అప్పుల పాలైన రోజులు ఉన్నాయన్నారు. ప్రతి సర్పంచ్కు సుమారుగా లక్షలలో పెండింగ్ బిల్లులు రావాల్సి ఉండగా గత ప్రభుత్వం చేసిన మోసాలు ఈ ప్రభుత్వం కూడా పాటిస్తూ మా సర్పంచ్ల హక్కులను తుంగలో తొక్కుతుందని, ఎంతో శాంతియుతంగా గతంలో కూడా సర్పంచులు నిరసన తెలియజేస్తే అక్రమంగా అరెస్టులు చేయడం చాలా బాధాకరమని, గ్రామాలు బాగుంటేనే దేశాలు బాగుంటాయని నినాదంతో ఎంతో చిత్తశుద్ధితో తమ గ్రామాలను అభివృద్ధి చేసి కొంతమంది సర్పంచులు తమ చేసిన అప్పులు తీరక ఉపాధి కూలీలుగా, హమాలి కూలీలుగా పని చేశారను, కొద్ది మంది సర్పంచులు అప్పుల భారంతో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చే సర్పంచులు ఈరోజు తామే ఆత్మహత్య చేసుకునే రోజులు ఈ ప్రభుత్వం తీసుకువస్తుందని, మూడు సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి బిల్లులు రాకపోవడంతో ప్రతి సర్పంచ్ కలత చెందుతున్నాడని, గత ప్రభుత్వం చేసిన పొరపాట్లతో సరైన రీతిలో ప్రతి సర్పంచ్ ప్రజలు బుద్ధి చెప్తే ఈ ప్రభుత్వం రావడం జరిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా నిరంకుశ పాలన చేస్తున్నదని, వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేని యెడల రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి మా సర్పంచ్ల సత్తా ఏందో చూపెడతామని సర్పంచులు అన్నారు. గ్రామపంచాయతీ ఎలక్షన్లో నుండి మున్సిపల్ లో జరిగే ప్రతి ఒక్క ఎలక్షన్ల వరకు ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టే రోజులు దగ్గర ఉన్నాయని సర్పంచులు అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య రాష్ట్రంగా చెప్పుకునే ప్రభుత్వంలో నిరసన కూడా తెలియజేయకుండా అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని సర్పంచులు అన్నారు. ఈ కార్యక్రమంలో సెలవేరి జ్యోతి మల్లారెడ్డి, మాధవరెడ్డి ప్రేమల చంద్రారెడ్డి, బిక్కనూరి రజిత శ్రీశైలం యాదవ్, మంగ రేణుక నర్సింలు మొదలైన వాళ్లను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది.