దోమకొండ గ్రామపంచాయతీలో సర్పంచ్‌–ఉపసర్పంచ్ ప్రమాణ స్వీకారం

దోమకొండ గ్రామపంచాయతీలో సర్పంచ్‌–ఉపసర్పంచ్ ప్రమాణ స్వీకారం

ఐరేని నరసయ్య సర్పంచ్‌గా, బొమ్మర శ్రీనివాస్ ఉపసర్పంచ్‌గా బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్ 22, 

దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఐరేని నరసయ్య, ఉపసర్పంచ్ బొమ్మర శ్రీనివాస్‌లు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలోని 16 వార్డులకు చెందిన 16 మంది వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సంక్షేమం, అభివృద్ధి దిశగా పారదర్శకంగా పాలన సాగించాలని సూచించారు.                 ఈ కార్యక్రమానికి పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం శాంతియుతంగా, విజయవంతంగా ముగిసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment