సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు ఘనంగా
– రవీంద్రభారతికి తరలిన గౌడ సోదరుల సందడి
రవీంద్రభారతిలో జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో వేడుకలు
కామారెడ్డి నుంచి భారీగా తరలి వచ్చిన గౌడ సోదరులు
బహుజన మహనీయుని జయంతి పార్టీలకతీతంగా జరుపుకున్నారు
18వ సారి నిర్వహించిన జయంతి ఉత్సవాలు
రాష్ట్ర, జిల్లా గౌడ నాయకుల హాజరు
హైదరాబాద్, ఆగస్టు 10 (ప్రతినిధి):
జై గౌడ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి గౌడ సోదరులు భారీ సంఖ్యలో తరలి వచ్చి మహనీయుని జయంతిని కనులపండుగగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్, 18వ సారి ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణమన్నారు. జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్, రాష్ట్ర నాయకులు బంబోతుల లింగాగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఉట్నూరు రామాగౌడ్, ఇందూరి సిద్దా గౌడ్, ఉపాధ్యక్షులు కర్రోల్ల శేఖర్ గౌడ్, మండల అధ్యక్షుడు బంబోతుల సురేష్ గౌడ్, కామారెడ్డి శ్రీనివాస్ గౌడ్, మద్నూర్ నగేష్ గౌడ్, శ్రీనివాస గౌడ్ తదితరులు హాజరై మహనీయుని జ్ఞాపకాలను స్మరించారు.