ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళి ప్రయాణం..

IMG 20240825 WA0043

అర్జెంటినా నుండి పార్న్ స్వాలొ అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి ఒక్కో సంవత్సరము ఫిబ్రవరి నెల లో మొదలై 8300 km ప్రయాణం చేసి మార్చ్ నెల చివరలో కాలిఫోర్నియా చేరుకుంటుంది .కాలిఫోర్నియా లో ఒక సురక్షితమైన ప్రదేశంలో నివాసం ఏర్పరుచుకుంటాయి. తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్ లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయ.కానీ అవి దాదాపుగా 16600 km ప్రయాణం చేస్తాయి అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు. ప్రయాణం అంత సముద్రమార్గమే అoదుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు , ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి ….. అవి అలసిపోయినప్పుడు , ఆకలివేసినప్పుడు , ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతుంది ….. అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళి ప్రయాణం మొదలెడుతుంది .ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో .చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం , పట్టుదల .పక్షులువాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు …… దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు మన మీద మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి , ఇంకెంత పట్టుదల ఉండాలి ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం! సాధించలేనిది ఏదిలేదు కదా..!!

Join WhatsApp

Join Now