కేటిఆర్ అబద్ధపు మాటలకి లై డిటెక్టర్లు పేలిపోయేలా ఉన్నాయి – సత్యం శ్రీరంగం. “

” కేటిఆర్ అబద్ధపు మాటలకి లై డిటెక్టర్లు పేలిపోయేలా ఉన్నాయి – సత్యం శ్రీరంగం. ”

ప్రశ్న ఆయుధం జనవరి 17: కూకట్‌పల్లి ప్రతినిధి

” ఈడీ, ఏసీబీ మొదటి విచారణలోనే నీ కళ్ళల్లో భయం కనపడింది కేటిఆర్ నీకు చిప్ప కూడు తప్పదు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ”

ముఖ్యమంత్రి ని లై డిటెక్టర్ పరీక్షకి సిద్ధమా అని సవాల్ విసరడం ఏమిటి కెటిఆర్ ? ఆ అర్హత కెటిఆర్ కు ఉందా అనే దానిపై గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, సంధ్య రెడ్డి, శ్రీకాంత్ యాదవ్. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ కేటిఆర్ ఈడీ ఆఫీస్ నుండి బయటకు వచ్చి మీసాలు తిప్పుతున్నాడు, ముఖ్యమంత్రి ని లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయాలి అంటుండు, కేటీర్ వ్యాఖ్యలు చూస్తుంటే కామెడీ సీన్స్ గుర్తుకొస్తున్నాయి అన్నారు, సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.. పిటిషన్ విత్ డ్రా చేసుకున్నాడు. నిబంధనలకు విరుద్దంగా కోట్ల రూపాయలు.. విదేశాలకు పంపిస్తే తప్పు కదా ? రేవంత్ రెడ్డి ని లై డిటెక్టర్ కు రమ్మనే అర్హత కేటిఆర్ కు లేదని, నువ్వు లోపల ఎంత భయపడ్డావో అందరికి అర్థం అవుతుందని, అవినీతే లేదంటాడు.. లొట్టపీసు కేసు అంటాడు. లొట్టపీసు కేసు అయితే నీకు ఎందుకు అంత భయమని అన్నారు. రేవంత్ రెడ్డి పై 80 కేసులు ఉన్నవి, నీలాగా లొట్టపీసు కేసులు కాదు ఏ రోజు భయపడలేదు దైర్యంగా ఎదుర్కున్నాడు, నువ్వు 55 కోట్లు దోచుకున్న దొంగవు నీకు విచారణ, జైలు కూడు తప్పదు అని అన్నారు. కేటిఆర్ మున్సిపల్ మంత్రి గా దోచుకున్నవి అన్ని కక్కిస్తాం, నువ్వు 6 నెలలు చంచల్ గూడ జైల్ లో ఉండటం ఖాయమని నీకు ఏ దారి లేదు జైలుకు పోవడమే తప్ప. తప్పుచేస్తే చట్టం ఎవ్వరిని వదిలిపెట్టదని, ఎవరికైనా శిక్ష తప్పదని అన్నారు. మీరు ముక్కు నేలకు రాసి బట్టలు లేకుండా తిరిగినా ప్రజలు మిమ్ముల్ని నమ్మరు కేటిఆర్, అన్ని కేసులు విచారిస్తే కెటిఆర్ 60 సంవత్సరాలు బయటకు రాడు, అవినీతి పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టారు. అతి చిన్న బీఆర్ఎస్ పార్టీకి అన్నికోట్ల పార్టీ ఫండ్ ఎక్కడిది కేటీర్ అని ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now