శ్రీ చౌడేశ్వరి మాత (మహా దేవి) విగ్రహ ప్రతీష్టా మహోత్సవానికి హాజరైన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం.”

” శ్రీ చౌడేశ్వరి మాత (మహా దేవి) విగ్రహ ప్రతీష్టా మహోత్సవానికి హాజరైన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం.”

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 11: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్ పల్లి నియోజకవర్గం బాగ్అమీర్ లోని దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు యాదవుల కుల దైవం శ్రీ చౌడేశ్వరి మాత (మహా దేవి) విగ్రహ ప్రతీష్టా మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఆపదల నుండి ఆదుకునే మాహాదేవి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో విరాజిల్లాలని అన్నారు. ఆధ్యాత్మిక భావాలు, దైవ చింతన సమాజంలో శాంతికి దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరు భక్తి భావాలను అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, సోషల్ మీడియా కన్వీనర్ శేఖర్ గజానంద్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment