*ఘనంగా అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ లో సామూహిక శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 10 ప్రశ్న ఆయుధం*
అన్నపూర్ణ ఆర్య వైశ్య సేవా సంస్థాన్ ఇల్లందకుంటలో ఆషాడ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను అర్చకులు ఫణి శర్మ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ అధ్యక్షుడు కాసం నగేష్ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకోవడం అందులో గురువారం కావడం విశేషమని ప్రతి సంవత్సరం 14 సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా 14 జంటల చేత 14 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి సంవత్సరంలో 12 పౌర్ణమి లు రావడం జరుగుతుందని అందులో నాలుగు పౌర్ణమి(ఆ కా మా వై) లకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని ఆషాడ శుద్ధ పౌర్ణమి, కార్తీక శుద్ధ పౌర్ణమి, మాఘ శుద్ధ పౌర్ణమి, వైశాఖ శుద్ధ పౌర్ణమి ఈ పర్వదినాలలో వ్రతాలు ఆచరించిన వారికి అన్ని శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు ఆషాడశుద్ధ పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకున్న వారికి శుభాలు కలుగుతాయని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకు తోడ్పాటు అందించిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ ఇల్లందకుంట సభ్యులందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకున్న భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇలాంటి తోడ్పాటు మునుముందు అందించాలని వారి తోడ్పాటును అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ ఎల్లవేళలా గుర్తించుకుంటుందని తెలిపారు