సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలె జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఈ పర్వదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం శుభసూచకం అని అన్నారు. బీసీ మహిళా సాధికారతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా శుభాభివందనాలు తెలిపారు. భారతీయ సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన సంఘసంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రిబాయి పూలె అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.