సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

*సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం*

*ఇల్లందకుంట జనవరి 3 ప్రశ్న ఆయుధం*

శుక్రవారం రోజున మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా మండల విద్యాధికారి రాముల నాయక్ ఘనంగా నిర్వహించారు

అనంతరం ఇల్లందకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి జి. అన్నపూర్ణ , జె. రాధికా రాణి, సిహెచ్. కౌసల్య, డి. ఉమాదేవి మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మహిళ ఉపాధ్యాయురాలు పద్మా రెడ్డి ప్రణీత రేష్మ అరుణ రమాదేవి సరిత లను శాలువాతో ఘనంగా సన్మానించారు

పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్. వేణు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జనవరి 3న 1831 లో నైగా మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడం జరిగిందని 1840 సంవత్సరంలో జ్యోతిరావు పూలే తో వివాహము జరిగిన తర్వాత శ్రీమతి సావిత్రిబాయి పూలే విద్యభ్యాసము నేర్చుకుని భర్తతో కలిసి సామాజిక రుగ్మతలను కులమత బేధాలను బాల్య వివాహాలను రూపుమాపడానికి బాలికల విద్యను మెరుగుపరచడానికి ఎంతో కృషి చేసినారని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. జయప్రకాష్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘసంస్కర్త ఉపాధ్యాయిని రచయిత్రి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే ని 1840 లో వివాహం చేసుకున్నారు, భర్త జ్యోతిరావు పూలే సహకారంతో వి విద్యభ్యాసాన్ని నేర్చుకుని 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారని తెలియజేశారు. అలాగే సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఈమెను స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక రుగ్మతలను సాంఘిక దురాచారాలను విడనాడి దేశ అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు జి. అన్నపూర్ణ, జె. రాధికారానీ, సిహెచ్. కౌసల్య డి. ఉమాదేవి లను సన్మానించారు

ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. జయప్రకాష్, ఉపాధ్యాయులు సిహెచ్. వేణు, కే. శంకర్, ఎం. సమిరెడ్డి, కె. సత్యనారాయణ, ఏ. సురేష్ ,ఏ. మనోహర్ రెడ్డి , సిహెచ్. కౌసల్య, జి. అన్నపూర్ణ, డి. ఉమాదేవి, ఎం సుధాకర్, సిహెచ్. రామకృష్ణ, ఎస్. విశ్వతేజ విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now