సమాజ సేవ చేస్తే ఆత్మ సంతృప్తి

సమాజ
Headlines in Telugu:
  1. ఎస్.బి.ఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గజ్వేల్ లో
  2. సమాజ సేవతో ఆత్మ సంతృప్తి – ఎస్.బి.ఐ జనరల్ మేనేజర్ ప్రకాష్ చంద్ర భరోర్
  3. 500 మందికి ఉచిత వైద్య సేవలు, క్యాన్సర్, బీపీ, షుగర్ టెస్టులు
  4. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల త్యాగాన్ని గుర్తించి, వైద్య శిబిరం నిర్వహణ
  5. గజ్వేల్ లో విద్యార్థుల లంబాడ నృత్య ప్రదర్శన, బహుమతుల ప్రదానం

– సరైన ఆరోగ్యం ఉంటేనే ముందుకు సాగుతాం

 ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన

 సాధారణ వైద్యం తో పాటు బీపీ షుగర్, క్యాన్సర్ టెస్టులు

 మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది

– ఎస్.బి.ఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్

గజ్వేల్, 01 డిసెంబర్ 2024 : 

సమాజ సేవతోనే ఆత్మసంతృప్తి ఇస్తుందని ఎస్బిఐ జిఎం ప్రకాష్ చంద్ర భరోర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీలో ఆదివారం ఎస్బిఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్, జనరల్ సెక్రటరీ ఆంజనేయ ప్రసాద్,సెక్రటరీ జనరల్ కృష్ణంరాజు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నర్ర సంతోష్ చందర్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ప్రకాష్ చంద్ర బారోర్ మాట్లాడుతూ ఎంత పెద్ద ఉద్యోగం చేసిన సమాజ సేవ చేస్తేనే ఆత్మ సంతృప్తి చెందుతుందని, నిరంతర పోటీ జీవితంలో పడి ఆరోగ్యాలను మర్చిపోతున్నాం. ఎంత డబ్బు ఉన్న సరైన ఆరోగ్యం ఉంటేనే ముందుకు సాగడం జరుగుతుందని, ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం బసవతారకం, అపోలో కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించామన్నారు. ఈ క్యాంపు లో ఆర్అండ్ఆర్ కాలనీ, గజ్వేల్ కి సంబంధించిన దాదాపు 500 మంది సాధారణ వైద్యం తో పాటు బీపీ షుగర్, క్యాన్సర్, కార్డియాలజీ టెస్ట్లు, కంటి ఆసుపత్రి సేవలు ఉపయోగించుకున్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన 40 మంది పాఠశాల విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన లంబాడ నృత్య ప్రదర్శనకు బహుమతి ప్రదానం చేశారు. సొంత ఊరిలో వైద్య శిబిరం నిర్వహణపై ఏవో డిప్యూటీ జనరల్ సెక్రటరీ సంతోష్ ని అభినందించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు జనరల్ మేనేజర్ ప్రకాష్ భారోర్, డీజీఎం జితేంద్ర కుమార్, డీజీఎం (బివో) వివేక్ చంద్ర జైష్వాల్, రీజినల్ మేనేజర్లు అరుణ జ్యోతి , వెంకటేశ్వర్లు, ఏజీఎంలు రాజ్ కిరణ్ రమణ చీఫ్ మేనేజర్లు మైపాల్ కృష్ణారెడ్డి బ్యాంక్ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now