సాటి ఎస్సీలన్న సంగతి మర్చిపోయిన వర్గీకరణ ఉద్యమాలు
*స్థానిక ఎస్సీ రిజర్వేషన్ ఉంటేనే ప్రయోజనం*
*బొమ్మెర శ్రీనివాస్ ఆరోపణ*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం పట్టణ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కార్యాలయం నుండి బుధవారం ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ రాష్ట్రంలో సుమారు సగం భూభాగం వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంత ఎస్సీ,మాల,మాదిగ ఉప కులాలు రాష్ట్రంలో జనాభా లెక్కకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు ప్రయోజనం లేదని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంత స్థానిక ఎస్సీ రిజర్వేషన్ ఉద్యోగం,ఉపాధి,రాజకీయ, కట్టుకున్నఇంటిపై,సాగు భూమిపై ఎటువంటి హక్కు లేని నిరుపేదలు ఏజెన్సీ ప్రాంత ఎస్సీలు. తెలంగాణ రాష్ట్రo ఏర్పడ్డాక మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో తీరని అన్యాయం జరిగింది.
తెలంగాణ రాష్ట్రo కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం చేసిన వర్గీకరణ మైదాన ప్రాంత ఎస్సీ కులాలకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.మైదాన ప్రాంత ఎస్సీ కులాలు ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు జరిగే అన్యాయాన్ని సాటిఎస్సి కులాలుగా ఏనాడు ప్రస్తావించలేదని ఖండించారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలు ఏ నాడు ఎమ్మెల్యే,ఎంపీ,మంత్రులు కావాలని అడగలేదు ఎస్సీ ఎమ్మెల్యే,మంత్రులు,ఎంపీలకు ఎక్కడ తక్కువ చేసిన ఊరుకోలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా మైదాన ప్రాంత మాల మాదిగ సంఘాలు ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల స్థానిక రిజర్వేషన్లపై ఉద్యమించడానికి ముందుకు రావాలని కోరారు.లేని పక్షంలో అంబేద్కర్ సాధించి పెట్టిన రాజ్యాంగ రిజర్వేషన్ పొందని ఎస్సీ కులాలు ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. సామాజిక న్యాయానికి సూత్రం చిట్టచివరిన అభివృద్ధిలో వెనుకబడ్డ వారికి చేరినప్పుడు మాత్రమే సమ న్యాయం జరిగినట్లు అని తెలియజేశారు.
ఎస్సీ వర్గీకరణ వల్ల ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు
by Naddi Sai
Published On: February 6, 2025 10:21 pm
