Site icon PRASHNA AYUDHAM

ఆదివాసి కార్పొరేటర్ సుజాత ను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

IMG 20250324 WA0010

ఆదివాసి కార్పొరేటర్ సుజాత ను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

– ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ నాయక్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదివాసి కార్పొరేటర్ అయిన సుజాత ను అవమానం చేసే పద్ధతిలో మాట్లాడి సుజాతను అవమానపరిచినందుకు ఎమ్మెల్యే సుధీర్ మాట్లాడినందుకు వారి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ లు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చట్టపరంగా , రాజ్యాంగబద్ధంగా, సుధీర్ రెడ్డి చేసిన తప్పులకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా కొట్లాడుతామని సుజాత కుటుంబానికి అండగా నిలబడతామన్నారు. ఒకవైపు రాజ్యాంగపరంగా కొట్లాడుతూనే రెండోవైపు సుధీర్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తామని స్పష్టం చేశారు. సుధీర్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడన్నారు. కుల అహంభావంతో, స్త్రీల పట్ల చులకన భావంతో, మగ దురహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి చట్టసభల్లో ఉండడానికి అర్హుడు కాదని , వెంటనే అతన్ని చట్టసభలను తొలగించాలని , సుధీర్ రెడ్డి కి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్న వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, రాజ్యాంగ మీద ఆయన చేసిన ప్రమాణానికి ఆయన కట్టుబడి లేడని తెలియజేశారు. ఎల్బీనగర్ ప్రజలు, రాష్ట్ర గిరిజనులు ఈ సంఘటన పట్ల స్పందించి సుజాత కుటుంబానికి ఆదివాసీ గిరిజన బంజారా లంబాడా సంఘంలు సుజాత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని తెలియజేశారు. గిరిజన బంజారా జాతి సుజాత కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉండి అండగా నిలబడతామన్నారు.

త్వరలోనే జాతీయ ఎస్టీ కమిషన్ కు ఢిల్లీకి వెళ్లి కలుస్తామని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల్లో సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా కంప్లీట్ చేసి న్యాయాన్ని పొందుతామని ఆదివాసీ లంబాడా బంజారా గిరిజన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్, బానోత్ గణేష్ నాయక్, బద్రి నాయక్, లాలూ నాయక్, సతీష్ నాయక్, మాన్య నాయక్, గిరిజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version