*ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి మరో ఐదు రోజులు గడువు పెంపు*
*ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్*
*కరీంనగర్ ఫిబ్రవరి 1 ప్రశ్న ఆయుధం*
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులల్లో 5 6 7 8 9 తరగతి లకు ప్రవేశం ఫిబ్రవరి 1కి మూగీయడంతో తెలంగాణ గురుకుల పేరెంట్ అసోసియేషన్ టి జి పి ఏ రాష్ట్ర కమిటీ అభ్యర్థుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరొక ఐదు రోజులు పొడుగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు దీనికి తెలంగాణ గురుకుల పేరెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా టీజీపీఏ రాష్ట్ర కార్యవర్గం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పిల్లలకు మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుంద తెలియని వారు వెంటనే ప్రవేశానికి అప్లై చేసుకోవడానికి వీలుంటుందని తెలిపారు ప్రభుత్వ గురుకుల కార్యదర్శులకు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆంబాల ప్రభాకర్(ప్రభు), ప్రధాన కార్యదర్శి గుడిసె పవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ దార మధు, జిల్లా ఇంచార్జీ సిలుముల సంజీవ్, జిల్లా నాయకులు సుంచు మల్లేశం, కాల్వకుమార్, మెరుగు తిరుపతి గుండేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.