విలేకరుల పై పెట్టిన ఎస్సి ఎస్టీ కేసు కొట్టివేత

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఎస్సీ ఎస్టీ కేసులో మణుగూరుకు పట్టణానికి చెందిన విలేకరులఫై 2019 లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఖమ్మం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్, డిస్టిక్ సెషన్ న్యాయమూర్తి దేవినేని రాం ప్రసాదరావు శుక్రవారం తీర్పును వెల్లడించారు. గతంలో అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసిన గూగులోతు మంగీలాల్ ఫిర్యాదు మేరకు 2019 లో విలేకరులు మాచర్ల శ్రీనివాస్, లింగ శ్రీనివాస్, మారాసు సుధీర్ పై మణుగూరు పోలీస్ స్టేషన్ లో
ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదయింది. విచారణ అనంతరం జర్నలిస్టులపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ శుక్రవారం అనగా 29.11.2024 ఖమ్మం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్, డిస్టిక్ సెషన్ న్యాయమూర్తి దేవినేని రాంప్రసాదరావు తీర్పునిచ్చారు. కేసులో సరైన సాక్షాధారాలు నిరూపణ కానందున కేసు కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించినారు. విలేకరుల తరఫున న్యాయవాదులుగా తేలూరి వెంకటేశ్వరరావు, మిరియాల సైదేశ్వర రావు బలమైన వాదనలు వినిపించి కేసును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment