*పోలీసుల పనితీరు,ప్రవర్తన,ఇతర సమాచారం,అబిప్రాయం తెలపడం కోసం QR కోడ్ ద్వారా ఫీడ్ బ్యాక్ సేకరణ.*
*స్కాన్ చేయండి పోలీస్ సేవలపై ప్రజా అభిప్రాయం తెలపండి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.*
సిరిసిల్ల, జనవరి 10,
తెలంగాణ రాష్ట్రం లోని అన్ని పోలీస్ స్టేషన్ ల యందు ఫిర్యాదుదారుల,బాధితులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రవర్తన, స్పందించిన విధానం పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు తమ అభిప్రాయం తెలపడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా QR కోడ్ పద్దతిని శుక్రవారం రోజున డి.జి.పి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రారంభించగా,ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ QR కోడ్ పోస్టర్ ని అధికారులతో కలసి ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఎస్పి మాట్లాడుతూ పోలీసుల గురించి ప్రజల నుండి వారి అభిప్రాయాలను సేకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ QRకోడ్ ద్వారా పిటిషన్, ఎఫ్‌ఐఆర్, ఇ-చలాన్ మరియు పాస్‌పోర్ట్ ధృవీకరణ మరియు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసు అధికారుల, సిబ్బంది ప్రతిస్పందన మరియు ప్రవర్తనపై ప్రజల ,బాదితుల అభిప్రాయం నమోదు చేయబడుతుందని, జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు సబ్ డివిజన్ కార్యాలయల్లో, సర్కిల్ కార్యాలయల్లో,అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో వుండే విధంగా క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ పోస్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ,దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోని పోలీస్ సేవలపై సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు.పోస్టర్ నందు గల క్యూఆర్‌కోడ్ లేదా https://qr.me-qr.com/aZMTxHDm లింక్ ద్వారా ఓపెన్ చేసి అందులో చూపిన విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.