స్కానింగ్ కేంద్రాలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.నాగనిర్మల

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్కానింగ్ కేంద్రాలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఫారం – ఎఫ్ సక్రమంగా నిర్వహించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.నాగనిర్మల అన్నారు. ఈ డాక్టర్ నాగ నిర్మల మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, జిల్లా బహుళ సభ్యుల చైర్మన్ (పి.సి అండ్ పి.ఎన్.డి.టి) ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన పి.సి అండ్ పి.ఎన్.డి.టి చట్ట సలహా సంఘం సమావేశంలో జరిగిన చర్చలను సమీక్షించినట్లు తెలిపారు. రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ గత నెల 16, 17వ తేదీలలో జిల్లాలో పర్యటించిన సందర్భంగా, రెండు అతి ముఖ్యమైన స్కానింగ్ కేంద్రాలు కీర్తి ఆసుపత్రి, లలిత ప్రసూతి, సంతాన లాప్రోస్కోపీ కేంద్రాలలో ఫారం – ఎఫ్ సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారని అన్నారు. దాంతో ఆ రెండు కేంద్రాల స్కానింగ్ గదులను మూసివేయడం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ 03-11-2025 వరకు తాత్కాలికంగా ఆ స్కానింగ్ కేంద్రాల అనుమతులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, ఇకముందు ఇలాంటి తప్పు పునరావృతమైతే సంబంధిత స్కానింగ్ కేంద్రాల అనుమతులను పూర్తిగా రద్దు చేసి పి.సి అండ్ పి.ఎన్.డి.టి చట్టం ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారని తెలిపారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలు తప్పని సరిగా ఫారం- ఎఫ్‌ను సక్రమంగా నిర్వహించాలని, పి.సి అండ్ పి.ఎన్.డి.టి చట్టంలోని నిబంధనలు, నియమాలను కచ్చితంగా పాటించాలని, ఎవరు నిర్లక్ష్యం వహించినా.. వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎం అండ్ హెచ్ఓ నాగనిర్మల స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment