స్కానింగ్ కేంద్రాలను ప్రోగ్రాం అధికారి ఆకస్మిక తనిఖీలు చేస్తూ నివేదికలు అందించాలి

స్కానింగ్ కేంద్రాలను ప్రోగ్రాం అధికారి ఆకస్మిక తనిఖీలు చేస్తూ నివేదికలు అందించాలి

– జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

గర్భస్త పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం జిల్లా సలహా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు . ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ గర్భస్త పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం ఈ చట్టనీ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించుటకుగాను చేపట్టు చర్యల గురించి ఈ సమావేశములో చర్చించరు. జిల్లా లోని అన్నీ స్కానింగ్ కేంద్రాలను ప్రోగ్రాం అధికారి ఆకస్మిక తనిఖీలు చేస్తూ నివేదికలు అందించాలని కమిటీ సభ్య్లులు సూచించారు. మండల స్థాయిలో వైద్యాధికారులు , పర్య వేక్షక సిబ్బంది ఆశాలు , ఆరోగ్య కార్యకర్తలు లింగ వివక్ష పట్ల క్షేత్ర స్థాయి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిచాలని , లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలను గుర్తించి చట్ట పరమైన చర్యలు చేపట్టాలని , ప్రతి స్కానింగ్ కేంద్రం జిల్లా అథారిటీ లో రిజిష్ట్రేషన్ చేసుకునే విధంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఇట్టి సలహా కమిటీ లో తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి , న్యాయ నిపుణులు, న్యాయవాది ఎం సంతోష్ కుమార్ , జిల్లా సమాచార , పౌర సంబందాల శాఖ అధికారి ఎన్ భీమ్ కుమార్ , ప్రోగ్రాం అధికారి డా.అనురాధ , సఖి కోఆర్డినేటర్ భారతి , ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శిరీష , డాక్టర్ రేఖ , మాస్ మీడియా అధికారి వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment