భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటను కచ్చితంగా కేటాయించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ (ఎస్ సి సి డబ్ల్యూ, ఐఎఫ్టియు) యూనియన్ కొత్తగూడెం రీజియన్ ప్రధాన కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు.
కొత్తగూడెం రైటర్ బస్తీలో జరిగిన సమావేశం కు రీజియన్ అధ్యక్షులు మోత్కూరి మల్లికార్జునరావు అధ్యక్షత వహించగా గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 23 24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో వాటానికి కేటాయించాలని వారు కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ వల్లే సింగరేణి యాజమాన్యానికి లాభాలు వస్తున్నాయని ఒకే సంస్థలో ఒకే దగ్గర పక్కపక్కన విధులు నిర్వహిస్తున్న పర్మినెంట్ కాంట్రాక్టు కార్మికులకు మధ్య వ్యత్యాశాన్ని చూడడం సరైనది కాదని ఆయన సూచన చేశారు. దశాబ్దాలుగా శ్రమనే నమ్ముకుని సింగరేణి మీదనే ఆధారపడుతూ అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాన్ని గడుపుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై ఈ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా దయ చూపాలని వారన్నారు. తెలంగాణ వస్తే బాగుపడితే అన్న బతుకుల్లో చీకటి నింపారని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వీరి జీతాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వారు కోరారు. ఇట్టి విషయంపై గతంలో సిఎండి బలరాం, కనీస వేతనాలు సలహా మండలి బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ని కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఉన్నామని తక్షణమే కార్మికులకు లాభాల వాటా కేటాయించి వేతనాలు పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ,కృష్ణ,పోశయ్య తదితరులు పాల్గొన్నారు.