ఆసిఫాబాద్ లో షెడ్యూల్డ్ కులాల సమావేశం
ఏజెన్సీ ప్రాంత ఎస్సి లకు రాజ్యాంగ హక్కులు కల్పించాలి
బొమ్మెర శ్రీనివాస్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు
ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కేంద్రంలో బుద్ధ విహార్ క్షేత్రంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఏజెన్సీ ప్రాంతం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్ షెడ్యూల్డ్ కులాలకు రోజు రోజుకు లేకుండా
అంధకారంలోకి నెట్టివేస్తున్నారని
ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికంగా నిరుపేదలుగా జీవిస్తున్నది షెడ్యూల్డ్ కులాలు మాత్రమేనని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉందని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు స్థానిక రాజకీయ రిజర్వేషన్ ఉన్నప్పటికీ వాటిని జనరల్ లో కలిపి మండల పరిషత్,జిల్లా పరిషత్ లో లక్షలాదిమంది తరపున ఎస్సీ కులాలకు ప్రాతినిధ్యం లేకుండా అన్యాయం జరిగిందని అన్నారు. నివాసముంటున్న ఇంటిపై తరతరాల సాగు భూములకు ఎటువంటి హక్కులు లేకుండా బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో తీరని అన్యాయం జరిగిందని
విమర్శించారు.ఏజెన్సీ ప్రాంతం పేరుతో తొలగించిన స్థానిక రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి అమలు చేసి ఉద్యోగ ఉపాధి రాజకీయపరమైన రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాటం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దుర్గo నగేష్,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ కన్వీనర్ దావుల రమేష్,నరసింగ మోరే, అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కాటం రమేష్,ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ రేగంటి కేశవ్,16 మందితో జిల్లా కమిటీనిఏకగ్రీవంగా ప్రకటించారు.