ఈ నెల 4 న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో షెడ్యూల్డ్ కులాల సమావేశం
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 1 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈనెల 4 న గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1- గం,, వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాటం సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్ సోమవారం కొత్తగూడెం సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కార్యాలయం నుండి వెల్లడించారు.ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మరియు జాతీయ కన్వీనర్ జేబీ రాజుగారు పాల్గొంటారని తెలియజేశారు.
ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ
కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని తెలియజేశారు.
ఉద్యోగ,ఉపాధి,రాజకీయ రిజర్వేషన్ తో పాటు నివాస ఇంటిపై,సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించాలని,అదే విధంగా సింగరేణి మైనింగ్లో భూ నిర్వాసిత బాధితుల పక్షాన,కే టి పి ఎస్,
బి టి పి ఎస్ వంటి కర్మకారాల్లో భూములు కోల్పోయిన బాధితుల పక్షాన పోరాడుతుందని తెలిపారు.ఈ సమావేశానికి పార్టీలకు,సంఘాలకు అతీతంగా షెడ్యూల్డ్ కులాల
నాయకులు,మరియు మాజీ జెడ్పిటిసిలు,ఎంపీటీసీలు, విద్యావంతులు ఉద్యమకారులు,యువతీ యువకులు పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు.