Site icon PRASHNA AYUDHAM

కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలను గ్రామీణ ప్రజలకు వివరించాలి

IMG 20250724 200351

కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలను గ్రామీణ ప్రజలకు వివరించాలి

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి

రాబోయే స్థానిక ఎన్నికలకు బిజెపి శ్రేణులు సిద్ధం కావాలి

మండల కార్యశాలలో ఎన్నికల‌ ప్రభారి గుజ్జ శ్రీనివాస్

కరీంనగర్ జూలై 24 ప్రశ్న ఆయుధం

కేంద్ర ప్రభుత్వ నిధుల తోటే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని , ఇందిరమ్మ ఇండ్ల లో కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా కూడా ఉందని బిజెపి మండల ఎన్నికల ప్రభారి గుజ్జ శ్రీనివాస్ అన్నారు. స్థానిక విఎస్ఆర్ గార్డెన్లో బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజెపి స్థానిక ఎన్నికల మండల కార్యశాలలో హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైకుంఠదామాలు, సెగ్రేషన్ షెడ్లు, నర్సరీల నిర్వహణ, గ్రామ పంచాయతీల నిర్వహణతో పాటు ఇటివల గ్రామాలలో‌ వేసిన సిసి రోడ్లు సైతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరి అయిన నిధులు మాత్రమే లబ్ధిదారులకు చెల్లిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో అధికారదర్పంతో విర్రవిగుతున్నారు తప్ప గ్రామాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యంమని ఎద్దేవా చేశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎమ్మెల్యే మాట వారి నాయకులే పట్టించుకోవడం‌లేదని, ఎమ్మెల్యే ఒకటి చెప్తే ఇక్కడి నాయకులు మరొకటి చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాబోయే స్థానిక ఎన్నికలకు బిజెపి నాయకులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్ నాయకులు దొంగల రాముడు దాసారపు నరేందర్, మందాడి జగ్గారెడ్డి, కొయ్యడ అశోక్, వివిధ మండల మోర్చా అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version