తెలంగాణ ఫీల్డ్ ట్రిప్ లో నిజాంపూర్(కె) పాఠశాల విద్యార్థులు by Donthi Mahesh Published On: December 16, 2024 6:32 pm సంగారెడ్డి/సదాశివపేట, డిసెంబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండలంలోని నిజాంపూర్ మరియు నిజాంపూర్(కె) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా సోమవారం నిజాంపూర్ కాలనీ సమీపంలో ఉన్న తోటను సందర్శించారు. తోటలో ఉన్న వరి పొలాలు, మామిడి, సపోటా, కొబ్బరి, జామ, నిమ్మ తోటలను ఉపాధ్యాయులు విద్యార్థులకు చూపించారు. మొక్కలు, చెట్ల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. మొక్కలు మరియు చెట్లు ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయి.. మరియు తయారు చేసుకున్న ఆహారాన్ని ఎక్కడ దాచుకుంటాయి.. పూవులు మరియు కాయలు ఎలా తయారు అవుతాయి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు. వరి నారు ఎలా పోస్తారు, నాటు ఎలా వేస్తారు.. మొదలగు విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, అరుణ, ఉపాధ్యాయులు నవనీత, సునీత, జర్ణయ, మల్లేశం, ప్రమీల, హిమగిరిజ, అక్బర్, విద్యార్థులు పాల్గొన్నారు. Post Views: 16