స్కూల్స్ మరియు కాలేజీలు సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించి నడుపుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలి.

స్కూల్స్ మరియు కాలేజీలు సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించి నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి.

నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాలి.

జాయింట్ కలెక్టర్ శోభిక ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి.

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 28( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్త మహేశ్వరరావు

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రవికుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా స్కూల్స్ మరియు కాలేజీలు సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించి నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు.నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాలని కోరారు. చాలా వాహనాలలో పరిమితికి మించి విద్యార్థులని ఎక్కిస్తున్నారని,దీని వలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.గత ఏడాది మద్యం సేవించి విద్యార్థులు ఎక్కిన వాహనాలు నడపడం వలన,చాలా ప్రమాదాలు జరిగాయి అన్నారు.బస్సుల ఫిట్నెస్ లు పై పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని కోరారు. మద్యం సేవించి వాహనాల నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రమాదాల నివారించేందుకు ప్రత్యేక డ్రైవులు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి హరికృష్ణ, చరణ్,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now