జడ్.పి.హెచ్.ఎస్ బూరుగుపల్లి గ్రామంలో విజ్ఞాన ప్రదర్శన
గజ్వేల్ నియోజకవర్గం 10 జనవరి 2025 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టి వై ఆర్ ఫౌండేషన్ మరియు విజ్ఞాన దర్శిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టి వై ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది టి. రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా గజ్వేల్ పట్టణ ప్రభుత్వ పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు మరియు బీరువాలు అందిస్తున్నామని అన్నారు. వీటి ద్వారా పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగ జరుగుతుందన్నారు. అనంతరం విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్ సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలు ఆచారాలు వాటిని నిర్మూలించుటకు పలు విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో టి వై ఆర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు టి. సత్యనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, అర్జున్, అబ్దుల్ రఫీక్, కవిత, ప్రసన్నలక్ష్మి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.