నాగారం ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ సందడి
విద్యార్థుల ఆవిష్కరణలతో ఆకట్టుకున్న ప్రదర్శన — శాస్త్రీయ దృక్పథం పెంపే లక్ష్యం
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం అక్టోబర్ 10
నాగారం ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను, శాస్త్రీయ దృక్పథాన్ని వెలికితీసే లక్ష్యంతో ఈ ప్రదర్శనను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కీసర మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) జమదగ్ని, చీర్యాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.సి. రాములు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థులు తమ సృజనాత్మక ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకున్నారు. సైనికుల కోసం చలికాలంలో వేడిని అందించే సోలార్ ప్యానెల్ కోట్లు, ఫ్యాక్టరీల నుండి వెలువడే కాలుష్యాన్ని ఫిల్టర్ చేసే యంత్ర నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సైన్స్ ఫెయిర్‌ను అగస్త్య ఫౌండేషన్ సభ్యులు త్రివేణి, అఫ్షాన్ పర్యవేక్షణలో నిర్వహించారు. పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు రమా సత్యశ్రీ, కమల, అర్చన, సంధ్యా రాణి, వందన ప్రదర్శనల ఏర్పాట్లలో కీలక పాత్ర వహించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, అరవింద్ కుమార్, రఘు, శ్రీదేవి, అజీజ్ అహ్మద్, పద్మ, గాయత్రి, వరమ్మ, సంజయ్ రాణీ, పాండురంగా రెడ్డి, సుప్రజ, విద్యా వాలంటీర్లు స్వప్న, పావని, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.