*కొనసాగుతున్న వర్సిటీ వీసీల దరఖాస్తుల పరిశీలన*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల, ఉన్నత విద్యల్లో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వ విద్యాలయాల్లో ఉపకులపతుల పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనను ఉన్నత విద్యాశాఖ చేపట్టింది. రాజకీయాలకు అతీతంగా 17 వర్సిటీలకు వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు ఖాళీగా ఉన్న 3,300 బోధన పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. వర్సిటీ మేనేజ్మెంట్ సిస్టం అమలు కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది.