మూడవ విడత నామినేషన్ల పరిశీలన సక్రమంగా చేపట్టాలి: కలెక్టర్

మూడవ విడత నామినేషన్ల పరిశీలన సక్రమంగా చేపట్టాలి: కలెక్టర్

కన్కల్ పంచాయతీ నామినేషన్ కేంద్రంలో ఏర్పాట్లను సమీక్షించిన ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 3 

 బుధవారం: స్థానిక సంస్థల ఎన్నికల మూడవ విడత నామినేషన్ల స్వీకరణ సందర్భంగా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా సాగాలని, సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండవ విడత నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) మరియు విత్‌డ్రావెల్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఏవైనా అనుమానాస్పద అంశాలు తలెత్తితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, తప్పిదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. మూడవ విడత చివరి రోజు ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి రద్దీ తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన మొదటి దశ నామినేషన్ ప్రక్రియ వివరాలను వెల్లడించారు. నవంబర్ 27 నుండి 29 వరకు జరిగిన మొదటి విడతలో 1520 వార్డులకు 3833 నామినేషన్లు, 167 సర్పంచ్ స్థానాలకు 1224 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. పోలింగ్, లెక్కింపు ప్రక్రియ డిసెంబర్ 11, 2025న జరగనున్నట్లు పేర్కొన్నారు.

కలెక్టర్‌తో పాటు తహసిల్దార్ శ్వేత, ఎంపీడీఓ సయ్యద్ సాజిద్ అలీ, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment