*అఖిలభారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవం*
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకోజు లింగాచారి*
*కొత్తపేట ప్రశ్న ఆయుధం ప్రతినిధి*
హైదరాబాదులో కొత్తపేట బాబు జగజ్జివన్ రావు భవన్ లో అఖిలభారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవం జరిగినది దీనికి జాతీయ అధ్యక్షుడు చండీలాల్ ప్రధాన కార్యదర్శి దినేష్ బాయ్ హాజరయ్యారు ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు చీకోటి ప్రవీణ్ పాల్గొన్నారు దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం అధ్యక్షత వహించారు ప్రధాన కార్యదర్శి సుంకోజు లింగాచారి మాట్లాడుతూ మాట్లాడుతూ విశ్వకర్మలందరూ తమ హక్కుల కొరకై పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు విశ్వకర్మలు పింఛన్ సౌకర్యం కల్పించాలని మరియు విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను సమకూర్చాలని అన్నారు విశ్వకర్మల జీవితాలలో వెలుగు నింపాలని మాట్లాడారు విశ్వకర్మలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆవంచ మురళి రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల సతీష్ రాష్ట్ర కార్యదర్శి కాసుల కుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధరచారి రాష్ట్ర సలహాదారులు బొడ్డుపల్లి మాధవ్ అద్దంకి కృష్ణమాచారి కౌలే అభిషేక్ వివిధ జిల్లాల నుండి వచ్చిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు పెద్ద ఎత్తున విశ్వకర్మ సభ్యులు పాల్గొన్నారు