*అఖిలభారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవం*
*తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కాసుల కుమార్ కి సన్మానం*
*చేర్యాల ప్రశ్న ఆయుధం ప్రతినిధి*
అఖిల భారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవాన్ని హైదరాబాదులోని కొత్తపేట బాబు జగజ్జివన్ రావు భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు చండీలాల్ ప్రధాన కార్యదర్శి దినేష్ బాయ్ ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపి నాయకులు చీకోటి ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం ప్రధాన కార్యదర్శి సుంకోజు లింగాచారి కోశాధికారి ఆవంచ మురళి రాష్ట్ర కార్యదర్శి కాసుల కుమార్ మరియు రాష్ట్ర కమిటీ వివిధ జిల్లాల నుండి వచ్చిన విశ్వకర్మలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కార్యక్రమంలో విశ్వకర్మల అభివృద్ధికై పాటుపడాలని జాతీయ అధ్యక్షుడు చండీలాల్ అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వకర్మలకు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం నామినేటెడ్ పదవులలో విశ్వకర్మల కు కేటాయించాలని అన్నారు మరియు 50 సంవత్సరాలు నిండిన విశ్వకర్మలకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం ఇవ్వాలని అన్నారు విశ్వకర్మలకు కలప పని చేసుకునే మా సభ్యులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు స్వర్ణకారులకు పోలీసులతో వేధింపులు లేకుండా చూడాలని అన్నారు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు మరియు వచ్చిన అతిథులకు మెమెంటో ఇచ్చి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధరచారి రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల సతీష్ రాష్ట్ర సలహాదారులు అద్దంకి కృష్ణమాచారి బొడ్డుపల్లి మాధవ్ మరియు పెద్ద ఎత్తున విశ్వకర్మలు మహిళా మణులు పాల్గొన్నారు
Post Views: 21