విమానాశ్రయాలకు దీటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు

*విమానాశ్రయాలకు దీటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు*

హైదరాబాద్:ఏప్రిల్ 15

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో త్వరలో జరగనున్న భారీ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలుగునుంది, విమానాశ్రయాలకు దీటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ నిర్మాణ పనులు చేపట్టనుంది..

దీంతో రైల్వే ఉన్నతాధి కారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 100 రోజుల పాటు స్టేషన్ పరిధిలోని మొత్తం ఆరు ప్లాట్‌ఫామ్‌లను మూసి వేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో దాదాపు 120 రైళ్లను చర్లపల్లి రైల్వే జంక్షన్ కాచి గూడ, నాంపల్లి, స్టేషన్లకు దారి మళ్లించనున్నారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణం లో భాగంగా భారీ స్కై కాంకోర్స్ లిఫ్టులు ఎస్కలేటర్లు,ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లను నిర్మించననున్నా రు. ఇందులో 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించనున్న భారీ స్కై కాంకోర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

అందులో రిటైల్‌ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా ప్లాట్‌ఫాం నెం.2–3, 4–5లలో దాదాపు 50 రోజుల పాటు పనులు కొనసాగనున్నా యి. అక్కడ పనులు పూర్తి అయిన వెంటనే నాలుగు ప్లాట్‌ఫామ్స్‌‌ను ప్రారంభిస్తా రు.అనంతరం ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 10 వైపు పనులు ప్రారంభిస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment