Headlines :
-
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్టు – ల్యాండ్ రిజిస్ట్రేషన్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్
-
నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కేసు – సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్టు
-
సికింద్రాబాద్ లో ల్యాండ్ కేసులో సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్టు, 14 రోజుల రిమాండ్
సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతి అరెస్టు అయ్యారు. ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించిన కేసులో సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు.. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి మేడ్చల్ కోర్ట్ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్ నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా పద్మాజా రెడ్డి అనే మహిళా కబ్జా చేసింది.
ఈ సమయంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ గా పనిచేసిన జ్యోతి.. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు పద్మజా రెడ్డికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పద్మజా రెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ జ్యోతి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..మంగళవారం (అక్టోబర్ 29) జ్యోతిని అరెస్ట్ చేశారు.