చెరువుల వద్ద భద్రతా చర్యలు 

చెరువుల వద్ద భద్రతా చర్యలు 

 — కలెక్టర్ ఆదేశాలు

— బతుకమ్మ వేడుకల్లో మత్స్య సంఘాల సహకారం తప్పనిసరి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 24

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ సంబరాలు సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో జరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు.

ప్రతి గ్రామంలోని చెరువుల వద్ద బతుకమ్మ ఆడే మహిళలు, పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు సమన్వయంతో ముందుకు రావాలని సూచించారు.

ప్రతి సంఘం నుంచి రోజుకు 5 నుంచి 10 మంది సభ్యులు స్థానిక గ్రామ కార్యదర్శితో కలసి చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.

Join WhatsApp

Join Now