ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్….. ఈ సృజన జీవితాలను మలుపు తిప్పుతుంది నేటి సౌకర్యాలు భేష్
అధ్యాపకురాలు వనజ
ఒకే వేదికపై ఇంతమంది చిన్నారుల సృజనాత్మకతను కల్లారా చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుందని. ఈ సృజనకు పదును పెడితే జీవితాలు ఉన్నత స్థాయికి చేరుతాయని రామచంద్ర పీజీ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు కే వనజ అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు అయిన శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ, మా చిన్ననాటి రోజుల్లో చదువుకోటానికి సౌకర్యాలు అతి తక్కువగా ఉండేవని, పెరిగాయని చెప్పారు . విద్యార్థులంతా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని చక్కటి చదువులు కొనసాగించాలని చెప్పారు. బ్రతుకు గమనాన్ని మార్పు చేసే శక్తి కేవలం ఒక చదువుకు మాత్రమే ఉందని, పేదవాని పిల్లలు కూడా గొప్పవారిగా తయారు చేసే ఏకైక సాధనం చదువు ఒక్కటే అని చెప్పారు. ఇలాంటి గ్రంథాలయాల ద్వారా చదువుకునేందుకు అవకాశాలు దొరుకుతున్నాయని, తలదించి పుస్తకాన్ని చదివితే అదే పుస్తకం నిన్ను తల ఎత్తుకునేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి చిన్నపిల్లలతో గడపటం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని, చాలాకాలం తర్వాత తన బాల్యం గుర్తుకు వచ్చి మనసు నిండుగా సంతోషం అనిపిస్తుందని అన్నారు. అనంతరం జూనియర్స్ సీనియర్స్ విభాగానికి దేశభక్తి గీతాల ఆలాపన, పర్యావరణ పరిరక్షణ, సెల్ఫోన్ లాభనష్టాలు అనే అంశంపై వకృత్వఫు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి మణి మృదుల, గ్రంథ పాలకులు మధు బాబు, నాగన్న, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.